ఆపరేషన్ మాలి ముగిసింది

Friday, November 20th, 2015, 10:37:40 PM IST


ఎట్టకేలకు మాలి ఆపరేషన్ ముగిసింది. ఈ రోజు పశ్చిమ ఆఫ్రికా మాలిలోని బమాకోలోని రాడిసన్ హోటల్ పై ఇద్దరు ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసి 170 మందిని బందీలుగా చేసుకొన్న సంగతి తెలిసిందే. బందీల్లో 120 మంది వరకూ టూరిస్టులు ఉన్నారు. సమాచారం అందుకొని ఉగ్రవాదులను నిలువరించాటానికి హోటల్ ను చుట్టు ముట్టిన భద్రతా బలగాలకు అమెరికా, ఫ్రాన్స్ సైన్యం సహాకారం అందించటంతో సుదీర్గ కాల్పుల అనంతరం ఆ ఇద్దరు తీవ్రవాదులను సైన్యాలు మట్టుపెట్టాయి.

హోటల్ లో బందీలుగా ఉన్న అందరినీ విడిపించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ ఆపరేషన్ కొంత విషాదంగా ముగిసింది. ఉగ్రవాదులు 18మంది టూరిస్టులను కాల్చి చంపారు. బందీలుగా ఉన్న 20 మంది భారతీయులు మాత్రం క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఇండియాలోని వారి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.