యావత్ భారతాన్ని ఫూల్ ని చేసిన మాల్యా భారత పౌరుడు కాడట..!

Monday, April 25th, 2016, 05:53:19 PM IST


భారతీయ బ్యాంకులకు దాదాపు 9000 కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్ లో ఎంజాయ్ చేస్తున్న మాల్యాను ఇండియా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వ ఆయన పాస్ పోర్టును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అసలు వాస్తవం తెలిసి విస్తుపోయింది. ఇంతకీ ఆ అసలు వాస్తవమేమిటంటారా మాల్యా భారత పౌరుడు కాడట.. బ్రిటిష్ పౌరుడట.. అదీ 1992 నుండి. ఈ వాస్తవం తెలిసి అందరూ మాల్యా తెలివిని భారత ప్రభుత్వాల చేతగానితనాన్ని బేరీజు వేసుకుంటున్నారు.

అసలు భారత పౌరుడే కాని మాల్య రాజ్యసభ సభ్యుడెలా అయ్యాడు. ఆయన సభ్యత్వాన్ని స్వీకరించేప్పుడు అఫిడవిట్లో ఆయన దాఖలు చేసిన దొంగ వివరాలను ప్రభుత్వం ఎలా గుర్తించలేకపోయింది అనేవి ఇప్పుడు ప్రధానంగా ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. వేరే దేశ పౌరసత్వం ఉన్న ఓ వ్యక్తి భారత రాజ్యాంగంలోని కీలక పదవులను అనుభవించి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వాలు కనిపెట్టలేకపోయాయి. ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్న ఉగ్రవాదుల గురించి చిన్న చిన్న విషయాలను సైతం కనిపెట్టగల నిఘా సంస్థ దేశంలో ఉన్న మాల్యాను ఎలా కనిపెట్టలేకపోయింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్న ప్రభుతవం ఇంత దారుణానికి పాల్పడ్డ మాల్యాను ఎలా శిక్షిస్తుందో చూడాలి.