సభలో ముఖ్యమంత్రి పై చెప్పు విసిరిన యువకుడు

Thursday, January 28th, 2016, 06:47:59 PM IST


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ యువకుడు చెప్పు విసిరి తన నిరసన తెలిపాడు. ఈ రోజు గురువారం భక్తియార్ పుర్ లో జరిగిన సభలో నితీష్ కుమార్ బీహార్ లో ఏప్రిల్ 1 నుండి అమలుచేయనున్న మధ్య నిషేధం పై మాట్లాడుతుండగా.. అదే సభలో జనం మధ్య ఉన్న సమస్తిపుర్ వాసి పర్వేష్ కుమార్ రాయ్ అనే వ్యక్తి కింది నుండి సభా వేదిక పైకి చెప్పులు విసిరాడు.

కానీ చెప్పులు నితీష్ కుమార్ కు దూరంగా పడటంతో గండం తప్పింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే పర్వేష్ కుమార్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏప్రిల్ 1 నుండి మధ్య నిషేధం విధిస్తున్నట్టు చెప్పిన నితీష్ ముందుగా స్వదేశీ మద్యాన్ని ఆ తరువాత స్వదేశంలో తయారయ్యే విదేశీ మద్యాన్ని నిషేధిస్తామని తెలిపారు.