చంద్రబాబు పెట్టుబడుల మూటలు మోసుకొస్తున్నారు

Wednesday, January 20th, 2016, 10:30:37 PM IST


స్విట్జర్ ల్యాండ్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదిక 46వ సదస్సుకు హాజరయ్యేందుకు దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారికి భారీ స్థాయిలో పెట్టుబడులు దొరికాయి. ఇప్పటికే పలు ప్రపంచస్థాయి కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచస్థాయి కంపెనీలైన మియర్ బర్గర్, ఫార్చ్యునర్, ప్లీసమ్, కెల్టర్, మెర్జ్ వంటి సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో బంగారు నిక్షేపాలున్నట్లు నిర్థారిస్తే సుమారు 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమని ఇండాని గ్లోబల్ కంపెనీ తెలిపింది. అలాగే విశాఖ, రాజమహేంద్రవరంలో కాఫీ పరిశ్రమకు పెట్టుబడులు పెట్టేందుకు మిమార్ బర్గర్ కంపెనీ ఆసక్తి చూపుతోంది.

అలాగే బయో మెడికల్ టెక్నాలజీ, డయాగ్నోస్టిక్స్, ఫండ్ మేనేజ్మెంట్, సోలార్ మాడ్యూల్స్, హైడ్రో పవర్ జనరేషన్, టెక్స్ టైల్స్ వంటి రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ శుభ పరిణామాలతో చంద్రబాబు పెట్టుబడుల వేట బాగానే వర్కవుట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అంతేగాక చంద్రబాబు ఆర్ధిక వేదిక సదస్సు ముగియగానే సింగపూర్ వెల్లే చాన్స్ ఉందని తెలుస్తోంది.