పలువురు సీనియర్ టిడిపి నేతలు అరెస్ట్

Wednesday, October 22nd, 2014, 09:43:43 AM IST


తెలంగాణలో విద్యత్ కోతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ తెరాస నేతలు నల్గొండలో మంగళవారం టిడిపి కార్యాలయంపై దాడి చేసి దగ్ధం చేసిన సంగతి తెలిందే. అయితే ఈ నేపధ్యంగా టిడిపి నేతలు తెరాస నేతల దుశ్చర్యను నిరసిస్తూ బుధవారం నల్గొండలో బంద్ కు పిలుపునిచ్చారు. కాగా టిడిపి చేపట్టిన ఈ బంద్ కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారి తీస్తోంది, అయితే ఈ నేపధ్యంగా హైదరాబాద్, విజయవాడ రహదారిపై ఉన్న చిట్యాల వద్ద టిడిపి సీనియర్ నేతలైన మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబిల్లి దయాకర్ రావు, కృష్ణయాదవ్, రమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వీరంతా హైదరాబాద్ నుండి నల్గొండకు వెళుతుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.ఇక బంద్ నేపధ్యంగా నల్గొండ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండడంతో టిడిపి నేతలను అక్కడికి వెళ్లేందుకు అనుమతించలేదని పోలీసులు తెలిపారు. మరి తెలుగుదేశం సీనియర్ నేతల అరెస్ట్ తో చిట్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.