టీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీనీ దారుణంగా చంపిన నక్సల్స్..!

Friday, July 12th, 2019, 09:31:05 PM IST

తెలంగాణలోని భద్రాద్రి జిల్లా చర్ల మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నేత శ్రీనివాసరావును ఈ నెల 8వ తారీఖున మావోలు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు శ్రీనివాసరావును మావోలు దారుణంగా చంపేసారు. ఈయన ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నారన్న నెపంతో ఈయనను కిడ్నాప్ చేసారు మావోలు.

అయితే నేడు ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావును చంపి మృతదేహాన్ని పడేసి వెళ్ళారు. అయితే శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు ఆ ప్రాంతంలో చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ కనిపించింది. అయితే ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలలో భారీగా మోహరించి మావోలపై దాడులు జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే శ్రీనివాస్ టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేత కావడంతో అధికార పార్టీ నాయకులకు కూడా పోలీసులు జాగ్రత్త వహించాలని సూచనలు ఇస్తున్నారు.