ఎన్టీఆర్ త్వరలోనే కోలుకుంటారు అని ఆశిస్తున్నా – మెగాస్టార్ చిరంజీవి

Wednesday, May 12th, 2021, 04:45:51 PM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడను అని వ్యాఖ్యానించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు అని చిరు పేర్కొన్నారు. అయితే అతను మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు బాగున్నారు అని తెలిపారు. అయితే ఎన్టీఆర్ చాలా ఉత్సాహం గా, ఎనర్జిటిక్ గా ఉన్నారు అని తెలుసుకొని సంతోషంగా ఫీల్ అయ్యా అని చెప్పుకొచ్చారు. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు అని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. గాడ్ బ్లెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటూ సోషల్ మీడియా లో తెలిపారు చిరు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.