లాక్ డౌన్ పొడిగింపు తో మెట్రో రైళ్ళ వేళల్లో మార్పులు!

Wednesday, June 9th, 2021, 08:00:30 PM IST


తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కేసుల తగ్గుదల తో మళ్ళీ సడలింపు ఇవ్వడం జరిగింది. లాక్ డౌన్ ను పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న చోట ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంది. అయితే లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యం లో హైదరాబాద్ మెట్రో రైళ్ళ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు మెట్రో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అదే తరహాలో సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్ బయలు దేరుతుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు రైళ్లు డిపోలకు చేరనున్నాయి.