300 మంది భారతీయులను బహిష్కరించిన మెక్సికో

Friday, October 18th, 2019, 07:50:43 AM IST

భారతదేశానికి చెందిన 300 మంది భారతీయులను బహిష్కరించినట్లు నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్ బుధవారం ఆలస్యం గా తెలిపింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయుల్ని న్యూ ఢిల్లీకి చార్టెడ్ విమానం లో పంపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విమానం లో 310 మంది పురుషులతో పాటుగా ఒక మహిళా కూడా వుంది. వారితో పాటు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మరియు మెక్సికో కో చెందిన నేషనల్ గార్డ్ ఉన్నట్లు తెలిసింది. మెక్సికో లో దాదాపుగా ఎనిమిది రాష్ట్రాల్లో వీరు ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణ మెక్సికో తో సహా అనేకమంది భారతీయ వలసదారులు దేశంలోకి ప్రవేశించి, యూ. ఎస్ సరిహద్దుకు రవాణా చేసేందుకు ఉన్నట్లు తెలుస్తుంది.

ఐఎన్ఎం చరిత్రలో ఇది ఒక అపూర్వమైన నిర్ణయం అని మెక్సికో వాసులు భావిస్తున్నారు. ప్రజలను ఇలా వాయుమార్గం ద్వారా తరలించడం ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. మెక్సికన్ ఎగుమతుల పై యూఎస్ సుంకాలను నివారించడానికి బదులుగా అక్కడి వలసలను అరికట్టడానికి మెక్సికన్ ప్రభుత్వం యూఎస్ తో జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకే మెక్సికో కి చేరుకున్న ఆఫ్రికా. ఆసియా వలసదారుల సంఖ్యను అధ్యయనం చేసిన ఐబిఐ కన్సల్టెంట్స్ యొక్క పరిశోధన సమన్వయకర్త కిటిలిన్ యేట్స్ దక్షిణ మెక్సికో లోకి వచ్చిన వారి సంఖ్య పెరిగిందని అన్నారు. మెక్సికో లో ఇలాంటి బహిష్కరణ మొట్టమొదటిది అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రక్రియలు ముందు ముందు జరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.