టీడీపీ కి నీచమైన ఆలోచనలు తప్ప సూచనలు ఇచ్చే అలవాటు లేదు – మంత్రి బొత్స

Thursday, June 10th, 2021, 05:04:27 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు వరుస విమర్శలు చేయడం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ, యెల్లో మీడియా రాద్దాంతం చేస్తున్నాయి అంటూ విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కి నీచమైన ఆలోచనలు తప్ప సూచనలు ఇచ్చే అలవాటు లేదు అంటూ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని వ్యాఖ్యానించారు. అంతేకాక విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఢిల్లీ పర్యటన లో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్ర మంత్రులతో చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులతో సహా, పలు అంశాల పై కీలక చర్చ జరపనున్నారు.