రాజకీయాలు మాట్లాడడం లేదు.. మరోసారి మంత్రి ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు..!

Saturday, April 3rd, 2021, 01:03:25 AM IST


టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేడు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడే వాళ్లం అని ప్రజల ఆకాంక్షల మేరకు మనం పనిచేయాలని అన్నారు. మెరిట్ లేకుండా ఏ సీటు రాదని, మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని అన్నారు.

అయితే పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలని, ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక రోజు నీ గడప కూడా తొక్కుతుందని ఈటల హెచ్చరించారు. తాను రాజకీయాలు మాట్లాడడం లేదని, రైతుల కోసం తాను మాట్లాడుతున్నానని కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని అనారు. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ, అది సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు. అయితే ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుందని అన్నారు.