ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఎన్నికలు వాయిదా వేస్తూ సింగిల్ బెంచ్ తీసుకున్న నిర్ణయంపై డివిజన్ బెంచ్‌లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఎన్నికలపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనే తమ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
అయితే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో పరిషత్ ఎన్నికలకు భయపడి టీడీపీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఓడిపోతామని తెలిసి కూడా బీజేపీ-జనసేన నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. అయితే టీడీపీ, బీజేపీ-జనసేన ఎన్నికలను అడ్డుకుంటున్నాయని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.