మరో రెండు వారాలు అత్యంత కీలకం.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

Wednesday, May 12th, 2021, 08:27:04 PM IST

తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, మందులు, వైద్య సామాగ్రి నిల్వలపై మంత్రి కేటీఆర్ టాస్క్‌ఫోర్స్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ కరోనా నియంత్రణకు అధికారులందరూ పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని, రాబోయే 2 వారాలి అత్యంత కీలకమని అన్నారు.

అయితే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ నిర్వహణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కరోనా కట్టడి కోసం చేపట్టిన ఇంటింటి సర్వేతో మంచి సత్పలితాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.