కరోనా కంటే చంద్రబాబు ప్రమాదకరం.. మంత్రి పేర్ని నాని సీరియస్..!

Thursday, May 6th, 2021, 04:25:23 PM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో 14 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. ప్రాణ భయంతో పక్క రాష్ట్రంలో దాక్కుని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కరోనా కంటే చంద్రబాబు పెద్ద ప్రమాదకరమని అన్నారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు.

అయితే కర్నూల్ జిల్లా నుంచి N440K అనే వైరస్ వ్యాపిస్తుందని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని అన్నారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి స్వయంగా ఇటువంటి వైరస్ లేదని, సీసీఎమ్బీ డైరెక్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు పదవి దిగే సమయానికి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఏ రకంగా ఉండేదో, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉందో అందరికి తెలుసని పేర్ని నాని చెప్పుకొచ్చారు.