పోచారం అలా అనలేదు : సిఎం

Friday, November 7th, 2014, 04:22:14 PM IST


తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి రైతుల ఆత్మహత్యల విషయంలో తప్పుగా మాట్లాడారని కొన్ని పత్రికలు అసత్యంగా ప్రచారం చేస్తున్నాయని.. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. పోచారం రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అని.. రైతుల సమస్యలు ఎలా ఉంటాయో పోచారానికి తెలుసునని.. కెసిఆర్ అన్నారు. పోచారం గురించి తనకు తెలుసునని.. అటువంటి వ్యాఖ్యలు పోచారం చేయడని ఆయనను వెనుకేసుకొచ్చారు.

తను అలా మాట్లాడలేదని.. తనతో తెలిపారని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని… అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యక్తిగత ఎజెండాను అమలు కోసం ఆందోళన చేస్తున్నాయని కెసిఆర్ అన్నారు.