రివ్యూ రాజా తీన్‌మార్ : శ్రీను వైట్ల ఖాతాలో పెద్ద డిజాస్టర్

Friday, April 14th, 2017, 06:54:26 PM IST


తెరపై కనిపించిన వారు: వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి
కెప్టెన్ ఆఫ్ ‘మిస్టర్’ : శ్రీను వైట్ల

మూల కథ :

ఎన్నారై కుర్రాడు వరుణ్ తేజ్ హెబ్బా పటేల్ ను ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం వేరొకరిని ఇష్టపడి అతడ్ని వదిలి ఇండియాకు వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తుండగా ఆమె ఒకరోజు వరుణ్ కు ఫోన్ చేసి తాను చాలా కష్టాల్లో ఉన్నానాని, కాపాడమని అడుగుతుంది.

వరుణ్ కూడా ఆమెకు సహాయం చేయాలని ఇండియా వస్తాడు. అలా తన ప్రేమ కోసం ఇండియా వచ్చిన వరుణ్ తేజ్ అనుకోకుండా లావణ్య త్రిపాఠి మరియు ఆమె కుటుంబానికి సంబందించిన పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అలా ఇరుక్కుపోయిన వరుణ్ తేజ్ ఆ ఇద్దరమ్మాయిల సమస్యల్ని ఎలా తీర్చాడు ? చివరికి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.

విజిల్ పోడు :
–> సినిమా ఫస్టాఫ్లో హీరో వరుణ్ తేజ్, హీరోయిన్లలో ఒకరైన హెబ్బా పటేల్ మధ్య నడిపిన రొమాంటిక్ ట్రాక్ బాగుందనిపించింది. అందులోని కొన్ని సన్నివేశాల్లో ఫ్రెష్ ఫీల్ దొరికింది. ఈ అంశానికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> వరుణ్ తేజ్ నటన పరంగా ఇంఫ్రూమెంట్ కనబర్చాడు. ఆరంభం నుండి ఆఖరు వరకు సినిమానౌ తన భుజాలపైనే మోయటానికి ట్రై చేశాడు. కనుక అతనికి రెండు విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక హీరోయిన్ హెబ్బా పటేల్ తన అభినయంతో ఆకట్టుకుంటే లావణ్య త్రిపాఠి ట్రెడిషనల్ లుక్స్ తో మెప్పించింది. కనుక మూడో విజిల్ వీరికి వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమా ఫస్టాఫ్ చాలా వరకు పర్వాలేదనిపించినా ఇంటర్వెల్ కు ముందు 10 నిముషాల నుండి సెకండాఫ్ చివరి వరకు శ్రీను వైట్ల నడిపిన కథనం మరీ దారుణంగా ఉంది. ఒక లక్ష్యం లేకుండా నడిచే సినిమాను చూస్తున్నంత సేపు విసుగు కంటే కోపమే ఎక్కువ వచ్చింది.

–> ఇక సెకండాఫ్ మొత్తం అనవసరమైన పాత్రలు ఎక్కువై అవసరం లేని ప్రతి చోట ఎంట్రీ ఇస్తూ సినిమాను అస్తవ్యస్తంగా తయారు చేశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా, ఫైటింగ్స్ అయితే మరీ ఓవర్ గా తోచాయి.

–> షకలక శంకర్, ప్రియదర్శిల కామెడీ సీన్లు నవ్వించకపోగా చికాకు తెప్పించాయి. దానికి తోడు క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా రోటీన్ గానే ఉండి బోర్ కొట్టించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> సినిమా సెకండాఫ్ కు ఒక నిర్ధిష్ట లక్యం లేకుండా నడపడం చూస్తే ఓక్ సినిమాను ఇలా కూడా చేయొచ్చా అనే కోపంతో కూడిన ఆశ్చర్యకరమైన సందేహం వస్తుంది.

చివరగా సినిమా చూసిన ఇద్దరు ప్రేక్షకులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ: సినిమా ఎలా ఉంది ?
మిస్టర్ బి : డిజాస్టర్
మిస్టర్ ఏ : నీకసలు బుద్దుందా ?
మిస్టర్ బి: ఎందుకలా అడిగావ్ ?
మిస్టర్ ఏ : మరి సినిమా డిజాస్టర్ అంటావ్.
మిస్టర్ బి : మరింకేమనాలి ?
మిస్టర్ ఏ: పెద్ద డిజాస్టర్ అనాలి.