ఏ బాబుతోనైనా చర్చకు సిద్ధం!

Friday, July 10th, 2015, 05:26:20 PM IST


తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిందని, పాలమూరు ఎత్తిపోతల పధకంపై తెలంగాణ తెలుగుదేశం నేతల వైఖరి స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే నీటిపారుదల రంగం కుంటుపడిందని కృష్ణారావు ఆరోపించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ శనివారం ఉదయం 10గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చర్చకు వస్తామని, చంద్రబాబుతోనైనా అయన తనయుడు చినబాబు(లోకేష్)తో నైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. అలాగే ఈ నేపధ్యంగా పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని జూపల్లి సవాల్ విసిరారు. ఇక ప్రజల నిరసనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకే పాలమూరులో బంద్ ప్రకటించామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.