చంద్రబాబును ఆకాశానికెత్తుతూ రోజా ప్రశంసలు.. వీడియో వైరల్..!

Tuesday, April 20th, 2021, 05:12:16 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆకాశానికెత్తుతూ ప్రశంసలు కురిపించింది. అదేంటి చంద్రబాబుపై ఎప్పుడూ ఒంటి కాలిపై లేచే రోజా ప్రశంసలు కురిపించడమేంటని అనుకుంటున్నారు కదా? అది ఇప్పుడు కాదండోయి.. గతంలో రోజా టీడీపీలో ఉన్నప్పుడు ఓ వేదికపై చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే అసలు ఆ వీడియోలో రోజా ఏం మాట్లాడిందంటే తెలుగుతల్లి అన్నపూర్ణ వరాలపట్టి, అమ్మణ్ణమ్మ కలల పంట, నందమూరి సింహ రాజకీయ వారసుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగు ఆడపడుచుల ఆత్మీయ సోదరుడు, తెలుగు సింహం, అపర రాజకీయ మేధాదురంధురుడు, పేదల పాలిట పెన్నిధి, తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన కీర్తి వెలుగుల చంద్రుడు, జగమంతా మెచ్చిన ఆంధ్రుడు, తెలుగు సామ్రాజ్య వీర.. ధీర.. శూర రాజకీయ చక్రవర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ రోజా మాట్లాడారు.