ప్రాణాలు అరచేతపెట్టుకొని లగాయింపు

Wednesday, October 1st, 2014, 02:45:15 PM IST


బీహార్ లోని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ససారం జిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. దసరా ఉత్సవాలలో భాగంగా.. ససారం జిల్లాలోని రోహాతాన్ లోని తారా చండి ఆలయంలో ఏర్పాటు చేసిన సాస్కృతిక కార్యక్రమానికి ఆ శాఖ మంత్రి వినయ్ బీహారీ హాజరయ్యారు. అయితే, ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రముఖ గాయకులూ కూడా హాజరుకావాల్సి ఉన్నది. కానీ, ఏర్పాట్లు సరిగా లేకపోవడం, సౌండ్ సిస్టం బాగా లేకపోవడంతో ప్రజలు ఆగ్రహించారు.. వెంటనే.. కుర్చీలను వేదికపైకి విసిరి తన నిరసనను తెలిపారు. అయితే, కుర్చీలు మంత్రికి తగలంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠిచార్ట్ చేశారు. కోపోద్రిక్తులైన ప్రజలు మంత్రి కారుకు నిప్పు అంటించారు.. పాపం ఆ మంత్రి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఎలాగోలా బయటపడ్డారు.