మోదీకి ‘ఓ పుస్తకం, ఓ కత్తి’ బహుమానంగా ఇచ్చారు

Thursday, December 24th, 2015, 03:09:34 PM IST


రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఆ దేశపు ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ అరుదైన బహుమతులను బహుకరించారు. మహాత్మా గాంధీ స్వయంగా రాసిన ఓ డైరీని, బెంగాల్ కు చెందిన18శతాబ్దపు కత్తిని పుతిన్, మోదీకి ఇచ్చారు. అంత అరుదైన బహుమతులను చూసిన మోదీ తన ఆనందాన్ని ట్వీట్ల రూపంలో పంచుకున్నారు. ఆయన ట్వీట్ చేస్తూ ‘ అధ్యక్షుడు పుతిన్ నాకు గాంధీ స్వహస్తాలతో రాసిన అయన డైరీలో ఒక పేజీని, 18వ శతాబ్దపు బెంగాల్ కు చెందిన ఓ కత్తిని బహుకరించారు. అందుకు ఆయనకు నా కృతజ్ఞతలు’ అన్నారు.

సాధారణంగానే రష్యా, భారత్ ల మధ్య బలమైన స్నేహ సంబందాలు ఉన్నాయి. పైగా నిన్న రష్యా వెళ్ళిన ప్రధాని అక్కడి భారత్ – రష్యా వార్షిణ సమావేశాల్లో పాల్గొని..రక్షణ, ఇంధన, అణు, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపటం వలన అవి మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.