రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఒబామా…?

Saturday, November 22nd, 2014, 02:10:49 AM IST


2015, జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే స్పెషల్ గెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాబోతున్నాడా? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. అవుననే అంటున్నాయి. మోడీ అమెరికా పర్యటన విజయవంతం కావడం.. అంతేకాకుండా.. ఒబామా మోడీల మధ్య సన్నిహితం పెరగడం కూడా ఇటువంటి ఊహాగానాలకు తావునిస్తున్నది. గతంలో ఒబామా ఒకసారి ఇండియాను సందర్శించిన విషయం తెలిసిందే.

భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అమెరికా రాజకీయాలలో దూసుకుపోతున్నారు. మొన్న జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లిక్ పార్టీకి చెందిన అనేక భారతీయులు గెలుపొందిన విషయం తెలిసిందే. అమెరికాలో భారతీయులకు ప్రాధాన్యత పెరుగుతున్నది.

ఇక మొన్న మయుమ్నార్ పర్యటనలో మోడీ అమెరికా అధ్యక్షుడిని రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా రమ్మని ఆహ్వానించినట్టు తెలుస్తున్నది. దీనికి ఒబామా కూడా పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తున్నది.