కేజ్రీవాల్ కు మోడీ సూచన!

Friday, February 20th, 2015, 12:33:09 PM IST


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోగ్య విషయమై ఒక సలహా ఇచ్చారట. కాగా ఇటీవల కలిసిన ఒక సమావేశంలో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న క్రేజ్రీని గమనించిన మోడీ యోగా గురు డాక్టర్ నాగేంద్రను ఒసారి కలవమని సలహా ఇచ్చారట. ఇక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే మోడీ డాక్టర్ నాగేంద్ర వద్ద చికిత్స పొందుతున్నారు. కాగా మోడీ సలహాను త్వరలోనే పాటిస్తానని కేజ్రీవాల్ కూడా తెలిపారని సమాచారం.

కాగా కర్ణాటకకు చెందిన 72 వసంతాల నాగేంద్ర మెకానికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ చేసి, అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అలాగే ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి కన్సల్టెంట్ గా కూడా నాగేంద్ర పనిచేశారు. ఇక యోగాపై 35 పుస్తకాలను రాసిన నాగేంద్ర ప్రఖ్యాత యోగా గురు బికెఎస్ అయ్యంగార్ నుండి ‘యోగా శ్రీ’ బిరుదును కూడా పొందారు. కాగా స్వామీ వివేకానందా యోగా అనుసంధాన్ సంస్థాన్ ద్వారా దాదాపు రెండు లక్షల మంది అస్తమా రోగులకు నాగేంద్ర చికిత్స అందించారు.