కేంద్రమంత్రులకు మోడీ విందు

Monday, October 20th, 2014, 10:16:21 PM IST

modi
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు ఈ సాయంత్రం విందు ఇచ్చారు. ఈ విందులో కేంద్ర మంత్రులందరూ పాల్గొన్నారు. కేంద్ర కేబినేట్ సమావేశం అనంతరం ఈ విందు జరిగింది. శీతాకాల సమావేశాలపై ఈ కేబినేట్ మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా.. మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ కేబినేట్ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

ఇప్పటికే కొంతమంత్రి మంత్రులు అదనపు శాఖల భాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ అదనపు బాధ్యతల నిర్వాహణ వలన ఆయా శాఖలలో పనులు పూర్తిగా నిర్వహించలేకపోతున్నట్టు తెలుస్తున్నది. దీంతో పనులు వాయిదా పడుతున్నాయి. దీంతో ప్రధాన మంత్రి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని భావించినట్టు తెలుస్తున్నది. శీతాకాలం సమావేశాలకంటే ముందుగానే ఈ విస్తరణ ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.