దేశపర్యటనకు రండి : మోడీ

Sunday, November 16th, 2014, 07:39:07 PM IST


ఆస్ట్రేలియాలోని బ్రిస్బైన్ లో జరుగుతున్న జీ 20దేశాల సదస్సులో భాగంగా జర్మన్ చాన్సలర్ ఏంజెలా మోర్కెల్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. జీ 20దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయని రెండు దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. జీ 20దేశాల అభివృద్దిలో అందరు భాగంపంచుకోవాలని మోడీ స్పష్టం చేశారు. జర్మనీ చాన్సలర్ మోర్కెల్ భారతదేశ పర్యటన కోసం రావాలని ఆయన కోరారు. అందుకు మోర్కెల్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది. జీ 20దేశాలసదస్సులో రెండో రోజు ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ సమావేశాలలో పాల్గొననున్నారు. రెండో రోజు కూడా మోడీ వివిధ దేశాదినేతలతో బిజీబిజీగా గడిపారు.