కాంగ్రెస్ కు మోడీ చురక

Friday, October 31st, 2014, 01:21:30 PM IST


అక్టోబర్ 31న భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధి వర్ధంతి విషయంపై ఎన్డీఎ ప్రభుత్వం ఎటువంటి అధికార కార్యక్రమాలు చేపట్టకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏక్ తా దివాస్ పేరుతో ఉత్సవాన్ని జరుపుతున్నదని..ఇందిరాగాంధీ వర్ధంతిని ప్రభుత్వం విస్మరించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ విమర్శలని ప్రధాని మోడీ తిప్పికొట్టారు.

జాతిసమైక్యతకు పాటుబడిన వ్యక్తీ పటేల్ అని.. ఇంతకాలం దేశసమైక్యత కోసం పాటుబడిన వ్యక్తిని దేశం మరిచిపోయిందని.. ఆయనను స్మరించుకోవడం దేశం యొక్క బాధ్యత అని మోడీ అన్నారు. 1984వ సంవత్సరంలో ఇదే రోజున దురదృష్టవశాత్తు ఇందిరాగాంధీ పై కాల్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 84లో జరిగిన అల్లర్లు జాతి సమైగ్రతను దెబ్బతీశాయని అన్నారు. 1984 అల్లర్లలో మరణించిన సిక్కు కుటుంబాలను ఇంతవరకు ఎవరు పట్టించుకాలేదని మోడీ తెలిపారు. అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలకు మోడీ నిన్న నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కో సిక్కు కుటుంబానికి 5లక్షల చొప్పున.. అల్లర్లలో నష్టపోయిన 3325 కుటుంబాలకు మొత్తం 167 కోట్ల రూపాయల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది.