తిరుమల శ్రీవారి పై కర్ఫ్యూ ప్రభావం…చరిత్రలోనే తొలిసారిగా..!

Tuesday, May 11th, 2021, 08:14:17 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల తో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు కర్ఫ్యూ ప్రభావం తిరుమల శ్రీవారి పై సైతం పడింది. నిన్న శ్రీవారిని 2,400 మంది భక్తులు దర్శించుకున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఇంత తక్కువ మంది దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలో ఇది అత్యల్ప దర్శనాల సంఖ్య అని తెలుస్తోంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 24 లక్షల రూపాయలు. అయితే టీటీడీ వెబ్ సైట్ లో ఏరోజు దర్శనానికి సంబందించిన టికెట్లు ఆరోజే పెడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ తీవ్రత కారణంగా తిరుమల శ్రీవారి ను దర్శించుకోవడానికి భక్తులు సైతం జంకుతున్నారు. అయితే కర్ఫ్యూ ఇంకొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది.