అభివృద్ధి వికేంద్రకరణ బిల్లు పై వైసీపీ ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు!

Saturday, August 1st, 2020, 02:43:47 AM IST


2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత కొద్ది నెలలుగా నడుస్తున్న మూడు రాజధానుల నిర్ణయం పై రాష్ట్ర గవర్నర్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ది వికేంద్రీకరణ, సి ఆర్ డి ఎ రద్దు బిల్లులను ఆమోదించడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పై ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. అయితే ఎంపీ భరత్ ఈ నిర్ణయం పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే అభివృద్ది వికేంద్రీకరణ లో బాగంగా మూడు రాజధానుల తో పాటుగా, రెండు రాజధానుల నడుమ ఉన్నటువంటి గోదావరి జల్లాలు కూడా అభివృద్ది అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అని అన్నారు. వెనుకబడిన మూడు ఉత్తరాంధ్ర కి జిల్లాలతో పాటుగా నాలుగు రాయలసీమ జిల్లాలు కూడా అభివృద్ది చేయడానికి వీలు ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే శ్రావణ శుక్రవారం రోజు ఈ నిర్ణయం వెలువడటం శుభదాయకం అని అన్నారు.