తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ – జన సేన కూటమి పోటీ

Thursday, March 4th, 2021, 07:42:32 AM IST

తిరుపతి ఉప ఎన్నిక లో బీజేపీ – జన సేన కూటమి పోటీ చేస్తుంది అని బీజేపీ ఎంపీ జివీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. అయితే అభ్యర్ధి పేరు ఇంకా ప్రకటించలేదు. ఈ తిరుపతి ఉప ఎన్నిక లో ఎవరు పోటీ చేస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు అందిస్తున్నా, బీజేపీ పై ప్రజలు విశ్వాసం చూపడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే రానున్న కాలం లో 8.17 లక్షల కోట్ల రూపాయల ఇన్ఫ్రా తదితర రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రియల్, పెట్రో కారిడార్లు ఏర్పాటు అయితే రాష్ట్రం లో 1.43 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అని వ్యాఖ్యానించారు.

రైల్వే జోన్ అంశం పై రైల్వే మంత్రిత్వ శాఖ తో తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని ఎంపీ వివరించారు. అయితే రాష్ట్రాన్ని బీజేపీ ఇన్ని రకాలుగా అభివృద్ది చేస్తుంటే ప్రతిఫలం మాత్రం దక్కలేదు అని వ్యాఖ్యానించారు. జమీలి ఎన్నికల అంశం ఇప్పట్లో తేలేది కాదు అని తేల్చి చెప్పారు. కోస్టల్ టూరిజం ప్రాజెక్ట్ కూడా పరిశీలన లో ఉందని అన్నారు. అయితే ఎంపీ జీవిఎల్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.