ఆ మాయలో పడొద్దన్న కవిత!

Wednesday, August 19th, 2015, 02:11:47 PM IST

kavita
తెలంగాణ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రసంగించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ నిర్ణీత జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయితీలుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే కరీంనగర్ వాసులు గల్ఫ్ ఏజెంట్ల మాయలపై అప్రమత్తంగా ఉండాలని కవిత హెచ్చరించారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ మెరుగైన ఉపాధి అవకాశాలను చూపిస్తామని చెబుతూ అరచేతిలో వైకుంఠం చూపించే గల్ఫ్ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండమని సూచించారు. అలాగే ఏజెంట్ల మాయమాటలు నమ్మి గుడ్డిగా గల్ఫ్ విమానాలను ఎక్కవద్దని కవిత పేర్కొన్నారు. కాగా ఇటీవల కాలంలో ఏజెంట్లను నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మోసపోయి బతకలేక తెలుగువారు ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కవిత అటువంటి మోసాలకు గురికావద్దని కరీంనగర్ ప్రజలను ముందుగా హెచ్చరించారు.