తెలంగాణలో మూడు వారాల పాటు లాక్ డౌన్ పెట్టండి – ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Tuesday, May 11th, 2021, 07:32:16 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఊహించని రీతిలో రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యం లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తెలంగాణ రాష్ట్రం లో మూడు వారాల పాటు లాక్ డౌన్ విధించాలి అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కి రాసిన లేఖ లో విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి కి వాక్సిన్ కొరత ఉందని తెలిపారు. రాష్ట్రానికి వాక్సిన్ కోటా పెంచాలి అని లేఖ లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతున్నాయి అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోవిడ్ మరణాల పై తప్పుడు నివేదికలు ఇస్తోంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుతూ కేంద్రానికి తప్పుడు సలహాలు ఇస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కి రాసిన లేఖ లో ప్రస్తావించారు.

అయితే ఒక పక్క కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ అమలు చేయాలి అంటూ పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యం లో ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి మోడీ కి లేఖ రాయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి దీని పై అధికార పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.