ఏపీ సీఎం జగన్పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన కామెంట్స్ చేశారు. తాను ఇన్ని రోజులు సీఎం పక్కనున్న వారు కుట్రలు చేస్తున్నారనుకున్నానని, కానీ ఆ కుట్రలో సీఎం జగన్ కూడా ఉన్నారనుకోలేదని అన్నారు. సీఎం జగన్కు అహంకారం తారాస్థాయిలో ఉందని రఘురామ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే ఢిల్లీలో ఏ సీఎంని పట్టించుకోరని, కేంద్రానికి అన్ని రాష్ట్రాల సీఎంలు ఒక్కటే అని రఘురామ అన్నారు. అంతేకాదు ఎంపీలకు ఇచ్చిన ప్రధాన్యత కూడా సీఎంలకు ఇవ్వరని అన్నారు. తనకు ప్రభుత్వంపై నమ్మకం లేదని గతంలోనే చెప్పానని, నా పార్టీని నేనెప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని రఘురామ అన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మా పార్టీ ఇప్పటివరకు పార్లమెంట్లో విప్ ఇవ్వలేదని రఘురామకృష్ణంరాజు అన్నారు.