దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది – రఘురామ కృష్ణంరాజు

Wednesday, March 3rd, 2021, 02:52:09 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం రునాంద్ర ప్రదేశ్ నుండి దివాలా ఆంధ్ర ప్రదేశ్ గా పరుగులు తీస్తోంది అంటూ విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం పది నెలల కాలానికి 73,912 కోట్ల రూపాయల అప్పు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే రికార్డ్ సృష్టించింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే తన పై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ల విషయం లో రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ను కలిశారు రఘురామ కృష్ణంరాజు.తన. నియోజక వర్గం కి వెళ్ళనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక అందుకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీ లను స్పీకర్ కి అందజేశారు ఎంపీ.

అయితే గత ఏడాది కాలం లో దేశం లోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రం 35 శాతం ద్రవ్య లోటు లో ఉందని అన్నారు. మామూలుగా ఐదు శాతం దాటకూడదు అని ఆర్ధిక నిపుణులు చెబుతారు అని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రం లో ఉన్న పోర్టు ల్లో అభివృద్ది కనబడటం లేదు కానీ, కొత్త గా మూడు పోర్టులు కడతాం అంటూ ప్రభుత్వం చెబుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పై రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.