ఎన్నికలు ముగిశాయి…ఇంధన ధరలు పెరిగాయి – రేవంత్ రెడ్డి

Thursday, May 6th, 2021, 11:24:42 AM IST

భారత దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల వేళ కాస్త అదుపులోనే ఉన్నా, మళ్ళీ ఈ ధరలు పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం పై ప్రతి పక్ష పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ కి చెందిన నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముగిశాయి, ఇంధన ధరలు పెరిగాయి అని అన్నారు. ఎవరు మోసపోతున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఎన్నికల ముందు వరకు అదుపులోనే ఉన్న వీటి ధరలు పెరగడం పట్ల పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ను పూర్తి స్థాయిలో అరికట్టడం లో కేంద్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీని పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.