ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్..!

Thursday, April 22nd, 2021, 07:53:29 PM IST


టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిందన్న విషయాన్ని స్వయంగా సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని సంతోష్ కుమార్ అన్నారు.

అయితే ఇటీవల తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, అత్యసవరమైతేనే తప్పా బయలకు వెళ్లాలని కోరారు. ఇదిలా ఉంటే ఎప్పుడూ సీఎం కేసిఆర్ వెంట ఉండే సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిన నేపథ్యంలో గత రాత్రి యశోద ఆసుపత్రికిలో చికిత్స కోసం వచ్చారు. ఈ సంధర్భంలో కూడా కేసీఆర్ వెంటే సంతోష్ కుమార్ ఉన్నారు.