బ్రేకులు వేయించోచ్చు అంతిమ విజయం మాత్రం న్యాయానిదే – ఎంపీ విజయసాయి రెడ్డి

Wednesday, April 7th, 2021, 12:00:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నాలుగు వారాల పాటు అమలు లో ఉండాలి అనే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేస్తూ ఉన్నత న్యాయస్థానం లో టీడీపీ, బీజేపీ, జన సేన పార్టీ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ మేరకు స్టే విధించింది హై కోర్ట్. అయితే హైకోర్ట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. బ్రేకులు వేయించొచ్చు, అంతిమ విజయం మాత్రం న్యాయానిదే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. నాయకుడు తేల్చుకోవాల్సింది ప్రజా కోర్టు లోనే అంటూ చెప్పుకొచ్చారు. చంకలు గుద్దుకుని తాత్కాలిక ఆనందం పొందితే జనం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మరో పక్క పలువురు నెటిజన్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తున్నారు. ఘాటు విమర్శలు చేస్తూ వైసీపీ తీరును ఎండగడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పట్ల ఎంపీ చేసిన వ్యాఖ్యల నుద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆ తరువాత అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం వైసీపీ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.