నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు – విజయసాయి రెడ్డి

Friday, February 26th, 2021, 10:22:46 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచినే నేనెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ, నువ్వో చచ్చిన విష సర్పానివి అంటూ విమర్శించారు. నిన్నెవరూ భయపెట్టడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. అరుదైన మానసిక వ్యాధి తో బాధపడుతున్నావు అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాకా అది మరింత ముదిరింది అంటూ చెప్పుకొచ్చారు.

అయితే కుప్పం నియోజకవర్గం లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు అధికార పార్టీ వైసీపీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు అధికార పార్టీ పై చేసిన వ్యాఖ్యలకి గానూ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేస్తున్నారు.