అదేదో చంద్రబాబు ఇప్పుడే క్లారిఫై చేయాలి – విజయసాయి రెడ్డి

Sunday, April 4th, 2021, 07:30:53 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేదో చంద్రబాబు నాయుడు ఇప్పుడే క్లారిఫై చేయాలి అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయరు సరే, అసెంబ్లీ ఎన్నికల వరకూ NGO లాగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏమైనా టేకప్ చేస్తారా అంటూ సెటైర్స్ వేశారు. అయితే అమరావతి రియల్ ఆర్టిస్టుల ఉద్యమం ఉంటుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. లేదంటే టెంట్లు పీకేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల అనుమానాలు ఇవి, నివృత్తి చేయండి అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే మరొక ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్దికి మద్దతు ఇస్తూ ప్రచారం లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగం లో టీడీపీ ను పల్లెత్తు మాట కూడా అనలేదు అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ తీరు ను ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.గతంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ జగన్, చంద్రబాబు నాయుడు ల పై జన సైనికులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.