రెండెకరాల నుండి రెండు లక్షల కోట్లకు ఎదిగావు – ఎంపీ విజయసాయి రెడ్డి

Monday, May 10th, 2021, 09:42:13 AM IST

Vijaya_sai

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తరచూ విమర్శలు చేసే ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండెకరాల నుండి రెండు లక్షల కోట్లకు ఎదిగావూ అంటూ చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశారు. పచ్చ మాఫియా ను సృష్టించి రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కు తినమనీ వదిలి పెట్టావు అంటూ విమర్శించారు. అయితే ఓడించినందుకు ప్రజల పై పగ పెంచుకొని ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్టనే దెబ్బతీసే కుట్రలు చేస్తున్నావు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత కృతజ్ఞత లేని వాడివి నీవు చంద్రం అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే అంతకుముందు కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చి ఫ్రీ వైద్య అందిస్తున్నారు అని పొరుగు రాష్ట్రాలు జగన్ గారి పై ప్రశంసల జల్లు కురిపిస్తుంటే పచ్చ వైరస్ కి కడుపు మండిపోతోంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే పక్క రాష్ట్రం లో ఉంటూ వేరే రాష్ట్రాల సీఎం లకు ఫోన్లు చేసి మరీ ఏడుస్తున్నాడు అంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ను డర్టీ ఎస్ట్ రాజకీయ నాయకుడు అనేది ఇందుకే అంటూ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు వైసీపీ తీరును ఎండగడుతూ వరుస విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ పై విమర్శలు చేస్తున్నారు.