జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే – ఎంపీ విజయసాయి రెడ్డి

Thursday, April 8th, 2021, 01:25:30 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ బాబు ను, కుల మీడియా ను అడుగు మాలోకం అంటూ నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కి నారా లోకేష్ సవాల్ విసురుతూ చేసిన వ్యాఖ్యల పట్ల విజయసాయి రెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా అంటూ విజయసాయి రెడ్డి అన్నారు. చిన్న మెదడు డ్యామేజీ అయినోడవి ఏమైనా అంటావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్మ కాకపోతే ఆ దిక్కుమాలిన పార్టీకి నువ్వొక పేద్ద నాయకుడివి అంటూ ఎద్దేవా చేసారు. జెండా పీకేసే ముందు ఇలాంటి ఎమోషన్స్ మామూలేలే అంటూ చెప్పుకొచ్చారు.

అయితే మరొక పోస్ట్ లో తెరాసా లో తెలంగాణ తెలుగు దేశం పార్టీ విలీనం అయ్యింది అని అన్నారు. TDLP ను మూసివేశారు అంటూ విమర్శించారు. అయితే ఏపీ టీడీపీ ను బంగాళాఖాతం లో విలీనం చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.లేకపోతే కృష్ణార్పణమో, గోదావరిలో నిమజ్జనం చేస్తారా అంటూ విమర్శలు చేశారు. పప్పు నాయకత్వంలో జాతీయ పార్టీని చేయాలనుకున్న చంద్రం కి ఇక నిరాశ, నిస్పృహే అంటూ సెటైర్స్ వేశారు. చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే అవి ఏమైనట్లు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మరి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.