చిట్టి నాయుడూ…నువ్వు ఏప్రిల్ ఫూల్ వి కాదు ఎవర్ గ్రీన్ ఫూల్ వి – విజయసాయి రెడ్డి

Friday, April 2nd, 2021, 02:54:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, సీఎం జగన్ పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిట్టి నాయుడూ, నువ్వు ఏప్రిల్ ఫూల్ వి కాదు, ఎవర్ గ్రీన్ ఫూల్ వి అంటూ విమర్శలు గుప్పించారు. ఫూల్స్ కే ఫుల్ అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నొకరు ఫూల్ చేయాలా అంటూ సూటిగా ప్రశ్నించారు. గూగుల్ లో ఫూల్, పప్పు అని టైప్ చేస్తే నీ పేరే వస్తుంది అంటూ సెటైర్స్ వేశారు. అయితే ప్రత్యేక హోదా ను తాకట్టు పెట్టింది ఎవరో గల్లీలో అడిగినా చెప్తారు అంటూ చెప్పుకొచ్చారు. 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టో ను మాయం చేసిన పార్టీ నీది అంటూ విజయసాయి రెడ్డి వరుస విమర్శలు చేశారు.

అయితే మరొక ట్వీట్ లో గడిచిన పంచాయతీ ఎన్నికల ప్రస్తావన తీసుకు వచ్చి టీడీపీ పై విమర్శలు చేశారు. 40 శాతం గ్రామ పంచాయతీ లు గెలిచాం అంటూ పచ్చ నేతలు డప్పు కొట్టారు అంటూ విమర్శించారు.ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని తర్జన భర్జన లేంటి అంటూ ప్రశ్నించారు. మునిసిపల్ ఎన్నికల్లో మీ రంగు బయట పడిందనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఓహో ఆ మాత్రం సీట్లు కూడా నిమ్మగడ్డ దయేనా అంటూ ఎద్దేవా చేసారు. పోటీకి ముందే అస్త్ర సన్యాసం చేసేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.