అచ్చెం బొచ్చం నాయుడు అసలు రంగు బయట పడింది – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, April 18th, 2021, 08:59:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో ప్రతి పక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టింగ్ ఆపరేషన్ లో అచ్చెం బోచ్చం నాయుడు అసలు రంగు బయటపడింది అంటూ విమర్శించారు. దీంతో తన బాస్ ఎక్కడ తంతాడో అన్న ఫ్రస్ట్రేషన్ పెరిగి పోయింది అంటూ చెప్పుకొచ్చారు. అయితే చిన్న బాస్ పప్పు నాయుడు మెప్పు కోసం సభ్యత, సంస్కారం గాలికి వదిలేసిన ఈ చట్నీ నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పాతాళం కన్నా దిగువకు దిగజారిన ఇతడ్ని ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక మరొక పోస్ట్ లో చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళ నాడు నుండి రప్పించి దొంగ ఓట్లు ఎలా వేయించాలో కుప్పం తుప్పు నాయుడు కి తెలిసినంతగా ఎవరికి తెలియదు అంటూ పరోక్షం గా సంచలన ఆరోపణలు చేశారు. ఆ అనుభవంతో నే ఎల్లో మీడియా డ్రామాలు అంటూ విమర్శించారు. డిపాజిట్ దక్కించుకునేందుకు పాట్లు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తిరుపతి రోడ్ల పై బస్సుల్లో వెళ్తున్న వారిపైనా మీ ప్రతాపం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తెలుగు దేశం పార్టీ ఏజెంట్లు ఒక్క దొంగ ఓటరు నైనా పట్టుకున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎంపీ విజయ సాయి రెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.