అచ్చెన్న డిక్లరేషన్ అమల్లోకి వచ్చినట్టే – ఎంపీ విజయసాయి రెడ్డి

Monday, April 19th, 2021, 02:09:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ పని అయిపోయింది అంటూ అధికార పార్టీ వైసీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక కి ముందు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యల ను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే 17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్న డిక్లరేషన్ అమల్లోకి వచ్చినట్టే అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విలీనం చేస్తామని కాళ్ళు పట్టుకున్నా కమలం పెద్దల నుండి స్పందన లేదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తదుపరి కార్యాచరణ పై అనుకుల మీడియా పార్టనర్లతో సమాలోచనలు జరుపుతున్నాడట బాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా పేరుతో మిని మహానాడు కూడా ఉండదని అంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ తీరును ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం టీడీపీ తీరును తప్పుబడుతూ వరుస విమర్శలు గుప్పిస్తున్నారు.