ముద్రగడ వార్నింగ్ కాల్ టు ఏపీ గవర్నమెంట్

Sunday, March 6th, 2016, 06:56:57 PM IST


కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభమ ఏపీ ప్రభుత్వానికి ఫైనల్ వార్నింగ్ కాల్ ఇచ్చారు. ఈసారి చేయబోయే దీక్ష ఎటువంటి పరిస్థితిలోనూ విరమించేది లేదని తెలిపారు. ప్రాణాలు పొయే వరకూ ఆమరణ దీక్ష చేస్తానని ఆ తరువాత
ఏమైనా చంద్రబాబు నాయుడిదే భాద్యతని అన్నారు.

బాబు మొదట ఇస్తామన్న 500 కోట్లను కాదని 1000 కోట్ల రూపాయలను ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయమూ జరగలేదు. పైగా ఆందోళకారులపై కేసులు పెట్టమన్నారు. ఆ మాట కూడా తప్పి రోజురోజుకూ కేసులను ఎక్కువ చేస్తున్నారని విమర్శించారు. ఇకపై తానూ దీక్షలు చేయబోనని ఈసారి చేసేదే ఆఖరి దీక్షని, దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు.