పోరాటాన్ని గుర్తింపు నోబెల్

Friday, October 10th, 2014, 05:09:15 PM IST


బాలల హక్కులకోసం రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న తనకు నోబెల్ శాంతి బహుమతి లభించడం చాలా ఆనందంగా ఉన్నదని కైలాష్ సత్యార్ధి పేర్కొన్నారు. 1990 నుంచి ఆయన బాలల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిష ప్రాంతానికి చెందిన కైలాష్ సత్యార్ది ఇప్పటివరకు 80వేల బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగించి వారికి విద్యా, పునరావాసాన్ని కల్పించారు.

గాంధీ మార్గంలో శాంతియుత ఆందోళనద్వారా బాలల హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా నోబెల్ ప్యానల్ ప్రశంసించింది. కాగ, నోబెల్ బహుమతి అందుకున్న భారతీయులలో కైలాష్ సత్యార్ది 7వ వ్యక్తి కావడం విశేషం. 1901 అల్ఫ్రెడ్ నోబెల్ పేరుతో నోబెల్ బహుమతులను రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రతిసంవత్సరం ప్రకటిస్తున్నది. అయితే, 1913వ సంవత్సరంలో మనదేశానికి మొదటి నోబెల్ బహుమతి లభించింది. రవీంద్రనాథ్ ఠాగుర్ రచించిన గీతాంజలి కావ్యానికి ఈ బహుమతి వరించింది. కాగ, ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో రెండు సార్లు, శాంతిలో రెండు సార్లు మనదేశానికి నోబెల్ బహుమతులు వరించాయి.