గుడ్ న్యూస్: రెమెడీసివిర్ కి జనరికి డ్రగ్ ఈ నెలలోనే విడుదల… ధర ఎంతంటే?

Tuesday, July 7th, 2020, 01:47:31 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రెమెడీసివిర్ డ్రగ్ చాలా కీలకం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది చాలావరకు రోగుల పై ప్రభావం చూపి, కరోనా వైరస్ భారి నుండి కాపాడేందుకు ఒక మార్గాన్ని ఇచ్చింది. అయితే దీనికి జనరిక్ వెర్షన్ ను తయారు చేసేందుకు మైలన్ ఎన్ బీ సంస్థకు అనుమతి రాగా, ఆ జనరిక్ డ్రగ్ ను ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. 100 మిల్లీ గ్రాము ధర 4,800 రూపాయలు గా ఉంటుంది అని ధర ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతేకాక ఇందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీ జీ ఐ) అనుమతి ఇచ్చింది అని పేర్కొంది.

అయితే ఈ డ్రగ్ ను డ్రేసెం పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే భారత్ లో ఈ డ్రగ్ విడుదల కావడం పట్ల పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 7 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. అయితే ఈ డ్రగ్ ను అత్యవసర పరిస్తితుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. భారత్ లో కరోనా వైరస్ భారిన పడిన వారికి హైడ్రో క్లోరొక్విన్ ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.