నలుగురు హీరోలు కాదన్నా సినిమా రెడి అందట..!

Saturday, February 27th, 2016, 06:22:55 PM IST


నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కళ్యాణ వైభోగమే సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చి 4న విడుదల కాబోతున్నది. రంజిత్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. అలా మొదలైంది, జబర్దస్త్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది. ఇక ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఇటీవలే బయటకు వచ్చాయి.

ఈ సినిమా కథను జబర్దస్త్ సమయంలోనే నందిని రెడ్డి రెడీ చేసుకున్నదట. జబర్దస్త్ స్థానంలో కళ్యాణ వైభోగమే చేయాలి. కాని, కొన్ని కారణాల వలన జబర్దస్త్ సినిమా చేయాల్సి వచ్చిందని నందిని రెడ్డి తెలిపారు. అయితే, కళ్యాణ వైభోగమే స్టొరీని నందిని రెడ్డి నలుగురు హీరోలకు వినిపించారట. నలుగురు హీరోలు కొంత బిజీ కారణంగా రిజక్ట్ చేశారని, చివరకు నాగ శౌర్య సెట్ అయ్యాడని పేర్కొన్నది. ఇక ఇందులో హీరోయిన్ కోసం దాదాపు ఆరు నెలల పాటు సెర్చ్ చేశామని, మాళవిక నాయర్ ను ఎంపిక ఆరునెలల తరువాత జరిగిందని నందిని రెడ్డి పేర్కొన్నారు. మాళవిక కు ఎగ్జామ్స్ ఉండటంతో మొదట సినిమా మొదట్లో అంగీకరించలేదట. కథ విన్నాక ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పిదని.. అలా ఈ సినిమా మొదలైందని పేర్కొన్నది నందిని రెడ్డి.