తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్ ఇంటింటికి వెళ్లి జగన్ పాలనలో జరుగుతున్న మోసాన్ని వివరించినట్టు ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు.
అయితే రాష్ట్రంలో పెద్ద పిల్లి జగన్ రెడ్డి.ఆయన పార్లమెంట్‌కి 28 చిన్న పిల్లుల్ని పంపాడని, 22 పిల్లులు లోక్ సభలో, 6 పిల్లులు రాజ్యసభలో ఉన్నాయని, ఆ పిల్లులన్ని మోదీ గారిని చూస్తే మియాం అంటాయ్ అని, ఆయనఏ బిల్లు తెచ్చినా మియాం అంటాయని, దాని కోసం ఇంకో పిల్లిని పంపుదామా అని లోకేశ్ ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ గారిని గెలిపించండి మీ సమస్యల పై పార్లమెంట్ లో పోరాడే శక్తి ఆమెకు ఇవ్వండి అని సర్వేపల్లి ప్రజలను కోరుకున్నట్టు లోకేశ్ చెప్పుకొచ్చారు.
సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంటింటికి వెళ్లి @ysjagan పాలనలో జరుగుతున్న మోసాన్ని వివరించాను. రాష్ట్రంలో పెద్ద పిల్లి జగన్ రెడ్డి.ఆయన పార్లమెంట్ కి 28 చిన్న పిల్లుల్ని పంపాడు.(1/3)#Lakshmi4Tirupati pic.twitter.com/EGJcWJBBqZ
— Lokesh Nara (@naralokesh) April 6, 2021