ఢిల్లీని గడగడలాడిస్తానన్న జగన్ గజగజ వణుకుతున్నాడు – నారా లోకేష్

Tuesday, April 6th, 2021, 03:56:34 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూటి ప్రశ్న వేశారు. అంతా అదిగినట్టే నేనూ అడుగుతున్నా జగన్ రెడ్డి అంటూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ సూటిగా ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయం పట్ల ఇప్పటికే జగన్ ప్రభుత్వం పై వైఎస్ వివేకా నంద రెడ్డి కూతురు విమర్శలు చేస్తుంది. ఈ మేరకు నారా లోకేష్ సోషల్ మీడియా వేదిక గా ప్రశ్నలు సంధించారు. చెప్పు అబ్బాయ్, మీ చిన నాయన ను మా నాయన నరికేశాడు అని అన్నావు, సీబీఐ దర్యాప్తు చేయాలి అని అన్నావ్, ఇప్పుడెందుకు సీబీఐ వొద్దు అంటున్నావ్ అంటూ చెప్పుకొచ్చారు. సమాధానం చెప్పు సైకో రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా నంద రెడ్డి హత్య కేసు సీబీఐ కి వస్తే చాలు, ఢిల్లీ ను గడగడ లాడిస్తానన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గజ గజ వణుకుతున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే ఈ విషయం పై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ నేతలు చేస్తున్న వరుస విమర్శల పై గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మరి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.