అవి చూసైనా మానవత్వంతో స్పందించండి…సీఎం జగన్ పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

Monday, May 10th, 2021, 02:54:23 PM IST

lokesh_jagan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కరోనా పేషంట్ల కు కనీసం వైద్య సేవలు అందడం లేదని కాకినాడ ఆసుపత్రి లో దయనీయ దృశ్యాలు చూసైనా మానవత్వం తో స్పందించండి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అని ట్వీట్ చేస్తే నాపై ఫేక్ కేసులు పెట్టించారు అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే ఆసుపత్రిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు మాత్రం చర్యలు తీసుకోలేదు అని ఎద్దేవా చేశారు. అయితే కాకినాడ రమణయ్య పేట ప్రాంతానికి చెందిన వాలంటీర్ లక్ష్మీ ఏడు నెలల గర్భిణి అని చెప్పుకొచ్చారు.

అయితే తనకు కరోనా వైరస్ సోకి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లో చేరారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే తనకు వైద్యం అందడం లేదని సెల్ఫీ వీడియో లో వేడుకున్నారు అని, కలెక్టర్ ఆదేశించినా వైద్యం అందక ఆమెతో పాటుగా కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్నుమూసింది అంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే వాలంటీర్ తో పాటుగా ఆమె కడుపులో ఉన్న పసిగుడ్డు మరణానికి మీ చేతకాని పాలన కారణం కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇప్పటికైనా తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రతి పక్షం పై ఎలా తప్పుడు కేసులు పెట్టాలి అనే కుతంత్రాలు మానేసి, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి అనే దానిపై సమీక్షలు చేయండి మూర్ఖపు ముఖ్యమంత్రి గారు అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.