కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారు – నారా లోకేష్

Thursday, June 10th, 2021, 11:39:21 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను వైసీపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చివేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పి ఎస్సీ లో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేశారు.అయితే గ్రూప్స్ 1 మెయిన్స్ పరీక్షలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నారా లోకేష్ పరీక్ష రాసిన అభ్యర్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ నేపథ్యం లో నారా లోకేష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మద్యం, ఇసుక, గ్రూప్స్ 1 ఇలా వైసీపీ ప్రభుత్వానికి కాదేదీ అవినీతి కి అనర్హం అన్నట్లుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే 2018 నోటిఫికేషన్ కి 2020 డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి అని వ్యాఖ్యానించారు. అయితే అందులో 9,678 మంది అభ్యర్థులలో 340 మందిని మాత్రమే ఇంటర్వ్యూ కి పిలిచారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కనీస విద్యార్హత లేని వారిని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారు అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పరీక్ష మూల్యాంకనం సక్రమం గా జరగలేదని ఫిర్యాదులు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు. ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్ మూల్యాంకనం ఎంచుకున్నారు అని, ఎంపిక చేసిన అభ్యర్దులు పేర్లు, మార్కులు, జవాబు పత్రాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ఈ మేరకు నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వం కి సూచించారు.